నితిన్ నబిన్ రాకకు బండి సంజయ్ భారీ ప్లాన్.. కరీంనగర్‌లో మహా పాదయాత్ర!

కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ (Nitin Nabin) ఈనెల 23వ తేదీన కరీంనగర్‌కు రానున్నారు. నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో మహా పాదయాత్రను సక్సెస్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) నిర్ణయించారు. ఈ మేరకు మహా పాదయాత్ర ఏర్పాట్లపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా పలువురితో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ వైశ్యా భవన్ నుండి మహా పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. సర్ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాల కుట్రలను తిప్పికొట్టడమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన (Bandi Sanjay Kumar) మాట్లాడుతూ.. ‘సర్’ పేరిట రాజ్యాంగ సంస్థలపై ఇండీ కూటమి పేరుతో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం’ పేరిట కరీంనగర్ లో నిర్వహించే మహా పాదయాత్రలో నితిన్ నబిన్ పాల్గొంటారని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి దాదాపు లక్ష మంది మహాపాదయాత్రలో పాల్గొనే అవకాశముందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

మారుమూల మండలం, గ్రామాల నుండి మొదలుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వరకు కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంతా హాజరయ్యే అవకాశముందన్నారు. పోలింగ్ బూత్ కేంద్రాల నుండి శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మహా పాదయాత్రపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. మహాపాదయాత్ర నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు నగరాన్ని కాషాయ మయం చేయాలని సూచించారు.

Also Read : “అధికార అహంకారంతో మాట్లాడొద్దు”.. సీఎం కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>