కలం, కరీంనగర్ బ్యూరో: అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు (Chalimeda Rajeshwara Rao)ను కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సత్కరించారు. 40 సంవత్సరాలుగా డెయిరీని విజయపథంలో నడిపిస్తూ, పాడి పరిశ్రమలో చేసిన విప్లవాత్మకమైన కృషికి, విశేష సేవలకు గుర్తింపుగానే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు అభినందించారు.
వేలాది మంది పాడి రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ కరీంనగర్ డెయిరీకి రాజేశ్వరరావు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని నూతన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

