మృత్యువు ఏ క్షణమైనా.. కళ్లముందే గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి

కలం, వెబ్ డెస్క్: మృత్యువు ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ మధ్యకాలంలో అకస్మిక మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సు నడుపుతూ డ్రైవర్.. వాకింగ్ వెళ్లిన సీనియర్ సిటిజన్, రన్నింగ్ రేసులో ఓ నిరుద్యోగి ఇలా ఎంతోమంది గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కోళ్లు కొనడానికి వెళ్లి కళ్ల ముందే కుప్పకూలాడు.

సూర్యాపేట జిల్లా చిలుకూరు (Chilkur) మండలం బేతవోలు గ్రామంలో కోళ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లిన శ్రీనివాస్‌ గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. వెంటనే స్పందించిన స్థానికులు సీపీఆర్‌ చేశారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల కాలంలో ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>