గిఫ్ట్ ఏ స్మైల్.. ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా

కలం, వెబ్ డెస్క్: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ విద్యార్థి అభినవ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా కల్పించారు. ల్యాప్‌టాప్ అందజేసి, కళాశాల ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తమకు గిఫ్ట్ అందజేసిన కేటీఆర్‌కు విద్యార్థి అభినవ్, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్.. తన పేరెంట్స్ లక్ష్మీనారాయణ, శ్రీలతలతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఐటీలో సీటు సాధించిన అభినవ్‌ను కేటీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించి విద్యార్థికి ల్యాప్‌టాప్‌ అందజేశారు. కాలేజీ ఫీజు కూడా తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చి, చక్కగా చదువుకొని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>