కలం, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) సెక్యూరిటీ ఏజెన్సీని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంస్థలకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం వర్సిటీ వీసీ చాంబర్లో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంత ఏజెన్సీలకే అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ను తెలంగాణ ప్రాంత వాసులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇస్తే పెద్దఎత్తున ఉద్యమంతో పాటు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్ఏ, ఎంఎస్ఎఫ్, ఎస్ఎస్యూ నాయకులు పాల్గొన్నారు.

