దంచి కొట్టిన పంజాబ్.. రాజస్థాన్ టార్గెట్ 223

కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ (Punjab Kings) బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఒకరి తర్వాత ఒకరుగా దూకుడుగా ఆడుతూ స్కోర్‌ను పరుగులు పెట్టించారు. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా ఆ ఊపు తగ్గకుండా ఆడారు. స్టోనిస్ మాత్రం చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో 62 పరుగులతో మైదానంలో వీరవిహారం చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కూపర్ కానోలీ (30) కూడా ధాటిగానే ఆడారు. మరోవైపు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బాధ్యతాయుతంగా ఆడుతూనే స్కోరు బోర్డును పరిగెత్తించారు. ఆయన 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 59 పరుగులు చేసి యష్ రాజ్ పుంజా బౌలింగ్‌లో వెనుదిరిగారు.

మధ్య ఓవర్లలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (30) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే, అసలు సిసలైన వినోదం మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాక మొదలైంది. రాజస్థాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకున్న స్టోయినిస్ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆయన స్ట్రైక్ రేట్ 281.81గా నమోదు కావడం గమనార్హం. సూర్యాంశ్ షెడ్గే 3 పరుగులతో ఆయనకు సహకరించారు.

రాజస్థాన్ బౌలర్లలో యష్ రాజ్ పుంజా రెండు వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నాండ్రే బర్గర్ 4 ఓవర్లలో ఏకంగా 59 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టగా.. రవీంద్ర జడేజా మాత్రమే 8 ఎకానమీతో కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. బ్రిజేష్ శర్మ వికెట్ తీయలేకపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>