ఉల్లాస్ పరీక్షపై అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ

కలం, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉల్లాస్ ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్షను (Ullas FLNAT Exam) ఆదివారం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, నిర్వహణ తీరును పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలకులు భాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి తిమ్మాజీపేట (Thimmajipet) మండలంలోని మరికల్, గోరిట గ్రామాల్లోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. గుర్తించబడిన ప్రతి అభ్యర్థి పరీక్షకు హాజరై పరీక్ష రాసేలా సంబంధిత అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, వీవీఏలు, సీసీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సమన్వయంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బి. నిరంజన్, వీవీఏ వసంత, గోరిట, మరికల్ గ్రామాల వీవీఏలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>