కలం, వెబ్ డెస్క్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 47,533 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాజెక్టులతోపాటు నాగార్జున సాగర్ డ్యామ్ కు నీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి వివిధ ఎత్తిపోతల పథకాలు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా కేటాయిస్తూ అధికారులు నీటిని కేటాయిస్తున్నారు.
మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు 325 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 10 వేల క్యూసెక్కుల నీళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ నీటి విడుదల ద్వారా సంబంధిత ప్రాంతాల్లో సాగునీటి అవసరాలు తీర్చనున్నారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 3,050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుండటంతోపాటు దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. దిగువకు విడుదల చేసిన నీటిలో కొంత భాగం నాగార్జునసాగర్‌కు చేరుతుండగా, మరికొంత నీటిని వివిధ ఎత్తిపోతల పథకాలకు అధికారులు మళ్లిస్తున్నారు.

