శ్రీరాంపూర్ సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికులకు తీవ్ర గాయాలు!

కలం, కరీంనగర్ బ్యూరో : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP -3 (శ్రీరాంపూర్ ప్రొటెక్షన్) భూగర్భ గని (Srirampur Mine)లో గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గని లోపల మైనింగ్ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా సైడ్ వాల్ (బొగ్గు పొరలు) కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ​

గాయపడిన వారిలో మహేందర్ అనే కార్మికడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి కార్మికులు, రెస్క్యూ టీం క్షతగాత్రులను గని పైకి తీసుకువచ్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని వెంటనే శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గని లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>