కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని తారక రామ్ నగర్ (సోఫీనగర్) కాలనీలో శ్రీరామ్ సేన యూత్ (Sriram Sena Youth) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పలుగుల నరేష్, ఉపాధ్యక్షులుగా బండ సాయి కుమార్, ఆకుల జగదీష్, ప్రధాన కార్యదర్శిగా కొవ్వూరి రాజేష్, కోశాధికారిగా చంద్రకాంత్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువత ఐక్యతతో ముందుకు సాగుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పలువురు ఆకాంక్షించారు.

