జానీ మాస్టర్‌కు షాక్.. డ్యాన్సర్స్ సంచలన నిర్ణయం..!

కలం, సినిమా : తెలుగు డ్యాన్సర్స్ యూనియన్ (Telugu Dancers Association) సంచలన నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ను ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణానగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవాలని భావిస్తున్నాన్నట్లు సమాచారం.

జానీ మాస్టర్ భార్య సుమలత్ ప్రెసిడెంట్ గా ఉండగా సుమలత కార్యవర్గాన్ని కాకుండా మెజారిటీ డ్యాన్సర్లు రఘు మాస్టర్ ను ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ముందు పెట్టి తమ మద్ధతును రఘు మాస్టర్ కు ప్రకటించనున్నారు.

కాగా, సుమలత కార్యవర్గానికి ఫెడరేషన్ సహాయ నిరాకరణ కొనసాగిస్తోంది. సుమలత కార్యవర్గానికి బదులుగా రఘుమాస్టర్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయాలని ఫెడరేషన్ లోని మెజారిటీ డ్యాన్సర్లు కోరుతున్నారు. ఏక పక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణితో సుమలత అసోసియేషన్ పాడు చేశారని డ్యాన్సర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మెజారిటీ డ్యాన్సర్లు రఘు మాస్టర్ ని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేయాలని ఫెడరేషన్ ని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>