రైతుల సాగునీటి కష్టాలు తీర్చండి.. మంత్రి ఉత్తమ్‌కు శ్రీహరిరావు వినతి

కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి సమస్యలను (Irrigation Issues) పరిష్కరించి, రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు (Kuchadi Srihari Rao) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రాలు అందజేశారు.

సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి వద్ద స్వర్ణ నదిపై లో లెవల్ కాజ్‌వే నిర్మాణం, మామడ మండలంలోని మామడ, కప్పన్‌పల్లి, దిమ్మదుర్తి గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు, ప్యారామూర్ గ్రామంలోని మూడు చెరువుల మరమ్మతులు, నర్సాపూర్ (జి)లోని దేవుని చెరువు కట్ట పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల రైతులకు సాగునీటి వసతి మెరుగుపడటంతో పాటు యాకర్‌పల్లి మీదుగా అడెల్లి పోచమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యం కలుగుతుందని వివరించారు. వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>