ఇండియా కూటమి నిరసన ర్యాలీని విజయవంతం చేయాలి: శ్రీహరి రావు

కలం, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న నిరసన ర్యాలీని(India Alliance Protest Rally) విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆరోపించారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని శ్రీహరి రావు (Srihari Rao) విమర్శించారు. స్థానిక మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ నుండి ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభమై ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన పాదయాత్ర ర్యాలీలో ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>