మునుగోడులో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

కలం, మునుగోడు: స్థానిక (Munugode) గాంధీజీ విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను (Sri Krishna Janmashtami Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, గొల్లభామల వేషధారణలో సందడి చేస్తూ ఆకట్టుకున్నారు. చిన్నారుల అందమైన వేషధారణతో పాటు ఉట్టికొట్టే కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని శ్రీకృష్ణాష్టమి విశిష్టతను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలంగాణ పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పండుగల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను విద్యార్థులకు తెలియజేసి, వాటిని భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జాని, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>