epaper
Monday, January 19, 2026
spot_img
epaper

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ టూర్

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సోమవారం ఉదయం మేడారంలో పునః నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజలు చేసి మహా జాతరను సీఎం ప్రారంభించారు. మేడారం పర్యటన పూర్తి చేసుకున్న ఆయన ఉదయం 9.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఇక్కడ్నుంచి నేరుగా దావోస్‌ (davos)
టూరుకు వెళ్లనున్నారు.

జనవరి 20 నుంచి నాలుగు రోజులపాటు దావోస్‌లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, ఎల్‌ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపి వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ అవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.

తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇతర అధికారులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>