Mobile Popup Ad
Mobile Popup Ad

సోలో మ్యాక్సింగ్.. ప్రేమ కంటే పైసలే ముఖ్యం అంటున్న జెన్‌జీ!

కలం, వెబ్ డెస్క్: ఇంటర్నెట్‌లో ఇటీవల ‘మ్యాక్సింగ్’ (maxxing) అనే పదం ట్రెండ్‌గా మారింది. స్లీప్‌ మ్యాక్సింగ్, లుక్స్‌ మ్యాక్సింగ్, కెరీర్‌ మ్యాక్సింగ్ అంటూ జీవితంలోని ప్రతి రంగాన్ని పరిమితులు పెట్టుకోవడం చాలామందికి అలవాటుగా మారుతోంది. ఈ క్రమంలోనే, డేటింగ్, రిలేషన్‌షిప్ బోర్డమ్ మాదిరిగా ‘సోలో-మ్యాక్సింగ్’ (Solo Maxxing) అనే కొత్త పదం వచ్చి చేరింది. ఇక్కడ చాలామంది ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగానే ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకోవడమే సోలో-మ్యాక్సింగ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ద్రవ్యోల్బణం ఇప్పుడు మనుషుల డేటింగ్ నిర్ణయాలను కూడా శాసిస్తోంది. డేటింగ్‌లు, బహుమతులు, కలిసి తిరగడం వంటి వాటి కోసం అయ్యే ఖర్చులు మోయలేని భారం కావడంతో నేటి తరం జెన్‌జీ (Gen Z) దూరంగా ఉంటున్నారు.

బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ 2026 రియల్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ప్రకారం.. అమెరికన్లు గత ఏడాది కాలంలో డేటింగ్‌ల కోసం సగటున రూ. 2,21,916 ఖర్చు చేశారు. పెరుగుతున్న ధరల వల్ల సగం మంది తాము వెళ్లే డేట్‌ల సంఖ్యను తగ్గించుకున్నామని చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటు డేట్‌ల సంఖ్య 14 నుండి 12కి పడిపోయింది. దాదాపు 47 శాతం మంది డేటింగ్ కోసం ఖర్చు పెట్టడం వృథా అని భావిస్తున్నారు. గతంలో స్నేహితులతో తిరగడాన్ని తగ్గించుకునేలా చేసిన ‘ఫ్రెండ్‌ఫ్లేషన్’ ట్రెండ్ లాగే.. ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు డేటింగ్ ప్రపంచాన్ని కూడా చుట్టుముట్టాయి.

ఈ సర్వే అమెరికాకు చెందినదే అయినప్పటికీ, ఈ పరిస్థితి మన ఇండియా కూడా కనిపిస్తోంది. ఉదాహరణకు ఢిల్లీ లాంటి నగరంలో పేరొందిన రెస్టారెంట్‌లో ఇద్దరు కలిసి డేట్ నైట్ డిన్నర్ చేయాలంటే ఆల్కహాల్ లేకుండానే సులభంగా రూ. 2,000 వరకు ఖర్చవుతుంది. దీనిని నెలకు మూడు నుంచి నాలుగు సార్లు లెక్కిస్తే, ఆ ఖర్చు కాస్తా రూ. 6,000 నుండి రూ. 8,000 కి చేరుకుంటుంది. అందుకే, ఈ ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవడానికి నేటి తరం సోలో-మ్యాక్సింగ్ వైపు మొగ్గు చూపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>