సోన్‌లో యోగ జోనల్ పోటీలు ప్రారంభం

కలం, సోన్: సోన్ మండల కేంద్రం (Soan)లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) ఆధ్వర్యంలో ఆదివారం జోనల్ స్థాయి యోగ సెలెక్షన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన యోగ క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌ -14, అండర్‌ -17 విభాగాల్లో ట్రెడిషనల్, రిథమిక్ సోలో, రిథమిక్ డబుల్, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ డబుల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి రాథోడ్ లక్ష్మణ్, యోగా నేచురోపతి వైద్యురాలు  డాక్టర్ అన్నపూర్ణ, పీడీలు ఇమ్రాన్, దర్శనం దేవేందర్, త్రివేణి, యోగా కోచ్‌లు ప్రదీప్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>