కలం, వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనులు పున: ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం పనులను ప్రారంభించారు. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. వీరిని గుర్తించేందుకు నెలల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనతో చాలా రోజుల పాటు పనులు ఆగిపోయాయి. ఇటీవల ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్‌లెట్ వైపు పనులు ప్రారంభించారు. అధికారులు డీబీఎం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్దతిలో పనులు కొనసాగిస్తున్నారు.
Read Also: అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా.. సీఎం రేవంత్ ట్వీట్
Follow Us On: Instagram

