కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో యువత చర్మ సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్మాన్ని మెరిపించేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు, మేకప్ వేసుకుంటారు, పేషియల్స్ చేయించుకుంటుంటారు. కానీ వీటి అవసరం లేకుండా మన జీవనశైలిలో చేసుకునే చిన్న మార్పులు కూడా మన చర్మానికి సహజసిద్ధమైన మెరుపును ఇవ్వగలవని మీకు తెలుసా? చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ ట్రిక్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. అటువంటి చర్మ సౌందర్య చిట్కాలేంటో (Skin Care Tips) తెలుసుకుందాం.
- మనం ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలట. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోయి, ఫలితంగా చర్మం కాంతిని సంతరించుకుంటుందని సూచిస్తున్నారు నిపుణులు.
- ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మర్దనా చేయడం. రోజూ 5 నుంచి 7 నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మర్దనా చేయాలట. ఇలా చేయడం వల్ల ఉబ్బినట్లుగా ఉన్న చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుందట. అంతే కాకుండా మంట, దద్దుర్లు వంటివి ఉంటే తొలగి పోతాయట. ఐస్ చర్మాన్ని బిగుతుగా చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
- మనం దైనందిన జీవితంలో మనం చేసే పనుల వల్ల ఒత్తిడికి గురవుతుంటాం. అయితే ఆ ఒత్తిడి, అలసట మన కళ్ల మీద ప్రభావం చూపిస్తాయట. అందుకే ప్రతిరోజూ పడుకునేముందు కళ్లకింది భాగంలో అలోవెరా జెల్ లేదా కొబ్బరి నూనె, ఏదైనా ఐ క్రీమ్‌ను రాసి మర్దన చేయాలట. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల రోజు మొత్తంలో ముఖం మీద పేరుకుపోయిన దుమ్మూధూళీ వదిలి చర్మం మృదువుగా యవ్వనంగా కనిపిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

