తప్పుడు వార్తలతో ముప్పు.. ‘ఫ్యాక్ట్ చెకింగ్’ చాలా కీలకం: కలెక్టర్ ప్రావీణ్య

కలం మెదక్ బ్యూరో: ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని సంగారెడ్డి (Sangareddy) కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. AI ద్వారా క్రియేట్ చేస్తున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. తప్పుదారి పట్టించే చిన్న సమాచారం కూడా సమాజంలో భయాలు, ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నారు. అందుకే జర్నలిస్టులు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన వార్తలను అందించాలని సూచించారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “వార్తలాప్ (VARTALAP)” పేరుతో జర్నలిస్టులకు ఒకరోజు వర్క్‌షాపును కలెక్టర్ ప్రావీణ్య (Collector Pravinya), పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్‌తో కలిసి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా చేరవేయడంలో పీఐబీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ముఖ్యంగా తప్పుడు వార్తలను గుర్తించి ఖండించడంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తున్నదని తెలిపారు. వర్క్‌షాపులో భాగంగా జర్నలిజంలో కృత్రిమ మేధస్సు వినియోగం, మీడియా రంగంలో ఆధునిక సాంకేతికతపై వస్తున్న మార్పులపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సుమారు 130 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

Read Also: టార్గెట్ త్రీ మంత్స్.. డ్రగ్స్ కేసుపై సిట్ ప్లాన్

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>