కలం, మెదక్ బ్యూరో: తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగూరు ప్రాజెక్టు (Singur Project) నుంచి దిగువన ఉన్న మంజీరా బ్యారేజీకి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి 0.15 టీఎంసీల నీటిని మంజీరా బ్యారేజీకి వదిలారు. గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

