కలం, మెదక్ బ్యూరో: గత పదేండ్లలో సిద్దిపేట పట్టణంలోని చెరువులు (Siddipet Lakes), కుంటలు కబ్జా అయ్యాయని, వాటిని రక్షించాలని కోరుతూ పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని వినతిపత్రం అందించారు. చిన్నకోడూరు, నంగునూర్ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్ యాదవ్ గురువారం హైదరాబాద్‌లో రంగనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిద్దిపేటలో కోమటి చెరువు, కోమటి చెరువు పెద్ద కాలువ, కప్పల కుంట, ఎర్రకుంట, మచ్చా వాణికుంట, చింతల చెరువు, నర్సపూర్, చెరువులు కబ్జాకు గురయ్యాయన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు అండదండలతో, వారి అనుచరులు కబ్జాలు పెట్టి కోట్ల రూపాయలను దండుకున్నారని ఆరోపించారు. మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సైతం చెరువులను కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కబ్జాలకు గురైన చెరువులను వెంటనే కాపాడాలని కోరారు.

