సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ ధర్నా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

కలం, మెదక్ బ్యూరో: SIR ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, సిద్దిపేట (Siddipet) ఓల్డ్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా (Congress Protest) కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ప్రెసిడెంట్ తూంకుంట ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ.. SIR ప్రక్రియ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని, ఓట్ల అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>