కలం, వెబ్ డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే పార్టీ మొదటి లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ సమాయత్తం కావాలని.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై కొట్లాడాలని సూచించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. నిజామాబాద్, కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలపై ప్రజలు ఏమనుకుంటున్నారో.. ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలని ప్రజలు భావిస్తున్నారని.. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే అంశాలను అడిగారు.
టీఆర్ఎస్ డిమాండ్ చేయడంతోనే..
ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్(Adilabad RIMS)లో అగ్ని ప్రమాదం జరిగి అయిదుగురు చిన్నారులు మరణించిన ఘటనపై టీఆర్ఎస్ పార్టీనే తొలుత స్పందించిందని కవిత (Kalvakuntla Kavitha) గుర్తు చేశారు. ఆసుపత్రి గురించి తాము మాట్లాడటంతోనే ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించి రూ.11 కోట్లు విడుదల చేసిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించిందన్నారు.
కలెక్టర్ సైతం రివ్యూ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తక్షణమే స్పందించి వారికి అండగా నిలవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు పోటీ చేసి సత్తా చాటాలని సూచించారు.
Also Read : రాహుల్ గాంధీ చెప్పిందే నిజమైంది: భట్టి విక్రమార్క
Follow Us On: X(Twitter)

