సీఎం సభలో విషాదం.. మహిళా సంఘం నేత మృతి!

కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేటలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో విషాదం (Siddipet Accident) చోటుచేసుకుంది. సభకు హాజరైన ఓ మహిళా సంఘం లీడర్ ప్రమాదవశాత్తు బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళా సంఘం గ్రూప్ లీడర్ కొమ్ము సారవ్వ (55) సిద్దిపేటలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లారు. సభ అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సారవ్వ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ మృతి పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సభ ముగిసిన వెంటనే ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. సారవ్వ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>