తమిళనాడులో విషాదం: వంద అడుగుల లోయలో పడిన మినీ బస్సు!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడైకెనాల్–పళని ఘాట్ రోడ్డులోని సవరిక్కాడు సమీపంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న 407 మినీ బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది (Kodaikanal Accident). ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లోయలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, క్షతగాత్రులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని కోయంబత్తూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఘాట్ రోడ్డులో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>