కలం, నిర్మల్ : సోన్ మండలం (Soan Mandal) సాకెర గ్రామంలోని శ్రీ శివ పంచాయతన రమా సహిత సత్యనారాయణ స్వామి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు ఆమెడ కిషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, రంగురంగుల చీరలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
అనంతరం మహిళలు సామూహిక శ్రీచక్ర కుంకుమార్చన, వాసవి మాత పారాయణం, హారతి కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

