భద్రాచలంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి!

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం పట్టణంలోని (Bhadrachalam Death) అశోక్ నగర్ కాలనీలో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన కే. మహేష్ ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన ఆయన తల్లి పని నిమిత్తం అమలాపురం వెళ్లారు. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహేష్, గత శనివారం తర్వాత స్థానికులకు కనిపించలేదు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే మహేష్ మృతి చెంది ఉండటాన్ని గమనించారు.

అంతేకాకుండా, వీధి కుక్కలు మృతదేహాన్ని పీక్కు తింటుండటాన్ని చూసిన స్థానికులు వాటిని అక్కడి నుంచి తరిమికొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>