ఉప్పాడ మత్స్యకారుల మిస్సింగ్.. సముద్రంలో ఏం జరిగింది?

కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల (Uppada Fishermen) గల్లంతు వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ నెల 4న ఉప్పాడ సముద్ర తీరం నుండి రెండు బోట్లు చేపల వేటకు వెళ్లగా, వాటిలో ఒకటి సురక్షితంగా తిరిగి వచ్చింది. అయితే, ఈ నెల 11న సింహాద్రి అనే బోటు యజమానితో సహా ఏడుగురు మత్స్యకారులు ఒడిశా రాష్ట్రం పూరి సమీపంలోని పారదీప్ తీరానికి చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 13న వారు ఇంటికి ఫోన్ చేసి, తాము ఉన్న ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ తర్వాత నుండి వారి ఫోన్ కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది.

పారదీప్ తీరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర ప్రాంతంలో ఈ బోటు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. తుఫాను ధాటికి బోటు దిశ తప్పి, ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు, మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>