జాతీయ అవార్డు రేసులో సీతంపేట బంజారా.. గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం!

కలం, ఖమ్మం బ్యూరో : ‘క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ’ విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు (National Panchayat Award ) నామినేట్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా (Seethampeta Banjara) గ్రామ పంచాయతీని కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై చేపట్టిన కార్యక్రమాలను, సాధించిన పురోగతిని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర బృందం.. గ్రామంలో అమలు చేస్తున్న పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాల వివరాలను, వాటి ప్రభావాన్ని అడిగి తెలుసుకుంది. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేంద్ర బృందంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (MOPR) కార్యదర్శి పినాకి తహబిల్దార్, SOEPR కన్సల్టెంట్ సత్యజిత్ పాత్రో పాల్గొన్నారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి. అనూష, కొత్తగూడెం డివిజనల్ పంచాయతీ అధికారి కె. ప్రభాకర్, ఎంపీడీఓ బి. భారతి, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>