సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ పోస్ట‌ర్ రిలీజ్‌

క‌లం, కరీంనగర్: బహుజన చక్రవర్తి, గోల్కొండను పరిపాలించిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కరీంనగర్‌లో సీనియర్ జర్నలిస్ట్, గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. సామాన్య ప్రజల కోసం పోరాడి, గోల్కొండను పరిపాలించిన బహుజన వీరుడిగా ఆయన చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రజలు జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ యాగండ్ల అనిల్ గౌడ్, గౌడ రాష్ట్ర నాయకులు పడాల అజయ్ గౌడ్, జిల్లా గౌడ సంఘం కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచర్ల అంజయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాగిరి సాగర్ గౌడ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మార్క రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 Also Read : భారత MMAకు టాలెంట్ ఉంది.. కానీ ఆదరణ కరువు!

Follow Us On: Instagram

కరీంనగర్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>