కలం, నిర్మల్ : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జన్మదిన వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో విద్య, వైద్యం, సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సి.హెచ్. వినోద్ కుమార్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాదిక్, ఎం.డి. సాదిక్, అఫ్రోజ్, హైమద్ ఖాన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!
Follow Us On: Sharechat
ఆదిలాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి

