కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో (Sangareddy Hospital) గర్భిణి అనిత మృతి ఘటనపై సంగారెడ్డి ఎమ్మెల్యే (Sangareddy MLA) చింత ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన 33 ఏళ్ల అనిత ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. పెళ్లైన 12 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన అనిత మృతిచెందడం విషాదకరమని ఎమ్మెల్యే అన్నారు.
అనిత ఆసుపత్రికి వచ్చిన సమయంలో అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. వైద్యులు సరైన సమయంలో స్పందించి ఉంటే, పరిస్థితి ఇంత దారుణంగా మారేది కాదని ఎమ్మెల్యే ఆరోపించారు. అనిత మృతి ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (Sangareddy MLA) డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం నిజమని విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : తెలంగాణ ఎవని పాలైందిరో అనిపిస్తోంది: రాజగోపాల్‌రెడ్డి
Follow Us On: Instagram

