యూపీలో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు?.. ఎస్పీ ప్రతిపాదనతో కొత్త చర్చ!

కలం, నేషనల్‌ డెస్క్‌ : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) మధ్య 2027 అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో 100 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా, 26 సీట్లకు మించి ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తొలుత కాంగ్రెస్ కనీసం 60 ఏ-గ్రేడ్ స్థానాలను కోరినప్పటికీ, ఆ తర్వాత తన డిమాండ్‌ను 100 సీట్లకు పెంచినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించాలని ఎస్పీ భావిస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 399 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బరిలోకి దిగి ఆరు సీట్లు గెలుచుకోవడంతో కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>