వెలింగ్టన్ టెస్ట్ డ్రాపై అశ్విన్ ఫైర్

కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ (Wellington Test) డ్రాగా ముగియడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే డ్రాకు అంగీకరించడాన్ని తప్పుబట్టారు. వెలింగ్టన్ టెస్టులో భారత్‌కు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా జట్టు మరింత ప్రయత్నించలేదని విమర్శించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో గెలుపు కోసం కావాల్సిన దూకుడు కనిపించలేదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జట్టు చివరి వరకు విజయం కోసం పోరాడేదని గుర్తుచేశారు. మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ సౌకర్యంగా ఆడుతూ, భారత ఆటగాళ్లతో మాట్లాడుతూ, నవ్వుతూ కనిపించడం కూడా జట్టులో దూకుడు తగ్గిందనడానికి సంకేతమని వ్యాఖ్యానించారు.

బౌలర్ల పనిభారం కారణంగా డ్రాకు అంగీకరించినట్లు గిల్ చెప్పినప్పటికీ, అశ్విన్ ఈ వాదనతో ఏకీభవించలేదు. బుమ్రాతో ఎక్కువ బౌలింగ్ చేయించకపోయినా, స్పిన్నర్లను ఉపయోగించి చివరి 10 ఓవర్లలోనైనా ప్రయత్నించాల్సిందని సూచించారు. వాషింగ్టన్ సుందర్‌ను బౌలింగ్‌లోకి తీసుకొచ్చి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, 20 వికెట్లు తీయలేకపోయిందని అశ్విన్ అన్నారు. ఆధిపత్యం ప్రదర్శించినంత మాత్రాన పాయింట్లు రావని, విజయం సాధిస్తేనే ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన తర్వాత కూడా గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించకపోవడం నిరాశ కలిగించిందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>