సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..!

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ (Sai Krishna Lockup Death) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారుల పాత్రపైనా దర్యాప్తు చేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌కు విజయవాడ రెండో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతినిచ్చింది.

పిటిషన్ ఆధారంగా ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఏ1 గా చేర్చాలని ఎంపీ గురుమూర్తి కోరారు. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖర్ బాబును ఏ2గా , విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం., మానసను ఏ3గా కోరినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి స్టేట్‌మెంట్‌ను ఆగస్టు 17న రికార్డు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.

కాగా, ఈ కేసు(Sai Krishna Lockup Death)లో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీని నిందితులుగా చేర్చాలన్న ఎంపీ పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆగస్టు 17న జరిగే ఎంపీ గురుమూర్తి స్టేట్‌మెంట్ రికార్డింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

Also Read : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>