పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు సంబంధించిన నిధుల విడుదల, పురోగతిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పోలవరం ఫేజ్-1 పూర్తికి మరో ఏడాది గడువు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ ఆర్ . కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖీత పూర్వక జవాబిచ్చారు.

ఈ సందర్భంగా 41.15 మీటర్ల నీటిమట్టం స్థాయికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు ఫేజ్ – 1 పూర్తికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-26) కేంద్రం మొత్తం రూ.12,620.53 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ – 1 పనులను తొలుత మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఇప్పుడు దానికి అదనంగా మరొక ఏడాది గడువు పెంపు నిబంధనను కూడా కల్పించినట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>