కలం, స్పోర్ట్స్ : సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar ) అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి 37 ఏళ్లు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆయన తన చిన్ననాటి జ్ఞాపకంతో గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు మొదటి బ్యాట్ పట్టుకుని దిగిన ఫొటోను.. 53 ఏళ్ల వయసులో అదే బ్యాట్‌తో మరోసారి రీక్రియేట్ చేశారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 49 ఏళ్లుగా ఆ బ్యాట్ తనతోనే ఉందని తెలిపారు. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌తో కరాచీలో జరిగిన మ్యాచ్‌తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. చాలా ఏళ్ల పాటు అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత ఆటగాడిగా నిలిచారు.
ఈ ఏడాది వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 99 రోజుల వయసులో టీ20 అరంగేట్రం చేయడంతో ఆ రికార్డు బద్దలైంది. తన తొలి బ్యాట్‌తో దిగిన ఫొటోకు సచిన్ ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చారు. 49 ఏళ్ల తర్వాత కూడా ఆ బ్యాట్ తనతోనే ఉందని పేర్కొన్నారు. సచిన్ అంతర్జాతీయ కెరీర్‌లో 34,357 పరుగులు, 100 సెంచరీలు సాధించారు. టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించారు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు.

