మెదక్‌లో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

కలం మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో రెండవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మెదక్ బస్టాండ్ ఎదుట ధర్నా చేయడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కార్మికులను అరెస్ట్ చేసి పాపన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరికొంత మంది కార్మికులు పోలీసుల నుంచి తప్పించుకుని బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తూ.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి యాజమాన్యం కీలక విజ్ఞప్తి చేసింది. మాయమాటలు నమ్మి సమ్మె కొనసాగించొద్దని, ఆర్టీసీ ప్రయాణికుల సేవే పరమావధిగా పనిచేస్తోందని అన్నారు. యూనియన్ ఇచ్చిన సమ్మె నోటీసులపై యాజమాన్యం ఇప్పటికే కమిటీలతో చర్చల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్న వేళ సమ్మెకు వెళ్లడం చెల్లదన్నారు. అయినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>