Mobile Popup Ad
Mobile Popup Ad

పాలతో మేడిగడ్డ శుద్ధి: బీఆర్ఎస్ వినూత్న నిరసన!

కలం, వెబ్​ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project)ను సందర్శించిన నేపథ్యంలో, వారి పర్యటనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రాజెక్టు పరిసరాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు ప్రాజెక్టు పైన ఎక్కడైతే నడిచారో, ఆ ప్రాంతాలను పాలతో కడిగి శుద్ధి చేశారు. ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టుపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, దానికి నిరసనగానే తాము ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

Read Also: కాళేశ్వరం ఎఫెక్ట్ : రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>