రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రైలు కింద పడి ఆత్మహత్య (Kamareddy) చేసుకున్నాడు. అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన గతక రాజు (30) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయన తండ్రికి పక్షవాతం రాగా, వైద్యం కోసం బంధువుల దగ్గర 15 లక్షల వరకు అప్పులు చేశారు.

ఎంత ఖర్చు చేసినా తండ్రి ఆరోగ్యం నయం కాకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేక రాజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో కామారెడ్డి రైల్వే స్టేషన్ (Kamareddy Railway Station) ప్లాట్‌ఫామ్ 3 వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>