బస్సులో జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు

కలం, వెబ్ డెస్క్​ : పరిగి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బస్సులో ఖాళీగా ఉన్న ఒక సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన చిన్న తగాదా చివరకు కొట్లాటకు దారితీసింది (PariGi bus fight).

పరస్పరం అరుచుకుంటూ తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని వారించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆవేశం ఆపుకోలేక బస్సులోనే ప్రయాణికుల ముందే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.

ఈ ఘర్షణతో బస్సులోని మిగతా ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తోపులాటతో బస్సులో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల మధ్య సీట్ల కోసం తరచూ ఇలాంటి రచ్చలు జరుగుతుండటంపై తోటి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>