ప్రాణాలమీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం!

కలం, వెబ్ డెస్క్​ : ప్రేమ వ్యవహారం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఒక వ్యక్తిని ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని రాత్రంతా చిత్రహింసలకు గురిచేసిన అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ (Saharanpur) జిల్లా మీర్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

బాధితుడు తన ప్రియురాలిని కలిసేందుకు కాసింపూర్ గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో అతడిని గమనించిన యువతి కుటుంబసభ్యులు వెంటనే చుట్టుముట్టి పట్టుకున్నారు. ఆపై అతడిని ఒక రాత్రంతా తాడుతో తలకిందులుగా వేలాడదీసి, స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు.

ఈ దారుణ దాడికి సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీశారు. యువకుడిని వదిలిపెట్టాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినట్లు బాధితుడి తరుఫు వారు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 9న జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో మీర్జాపూర్ పోలీసులు తక్షణమే స్పందించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>