రోహిత్, కోహ్లీయే టీమిండియా ఆస్తి.. రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్: 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టుకు పెద్ద ఆస్తిగా మారతారని మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ (Robin Singh) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన వన్డేల్లో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేయగా, కోహ్లీ ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఐఏఎన్ఎస్ సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాబిన్ సింగ్, వీరిద్దరి అనుభవం, ఫామ్ భారత జట్టుకు ఎంతో అవసరమని తెలిపారు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మైదానంలో అత్యుత్తమంగా రాణిస్తున్నారని రాబిన్ సింగ్ కొనియాడారు.

మరోవైపు రాబోయే వరల్డ్ కప్ కోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. జట్టుకు ఏ రకమైన ఆటగాళ్లు అవసరమో గంభీర్‌కు స్పష్టమైన అవగాహన ఉందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఈ ప్రణాళికల్లో భాగంగానే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు మళ్లీ అవకాశం దక్కిందని, ఫిట్‌నెస్ నిరూపించుకుంటే మహమ్మద్ షమీకి కూడా జట్టులో చోటు లభించే అవకాశం ఉందని రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ అద్భుతమైన బౌలర్లని, దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేశారని ఆయన కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>