కలం, వెబ్ డెస్క్: ఆర్థిక శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం (Nobel Prize) లభించింది. ప్రముఖ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ.హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్ బహుమతిని ప్రదానం చేయబోతున్నట్లు రాయల్ స్వీడీష్ అకాడమీ ప్రకటించింది. “మైక్రో ఎకానమిక్స్ స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులు” అనే అంశంపై వీరు చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా పురస్కారం దక్కింది.
వీరు రూపొందించిన నమూనాల ఆధారంగానే ప్రభుత్వాలు ద్రవ్య, ఆర్థిక విధానాలను సరైన సమయంలో అమలు చేసే అవకాశం లభించిందని స్వీడీష్ అకాడమీ స్పష్టం చేసింది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే తీవ్ర హెచ్చు తగ్గులను తగ్గించే అవకాశం ఉందని అకాడమీ ప్రశంసించింది. వీరు పరిశోధనలు అంతిమంగా ఆర్థిక మాంద్యం, అధిక వృద్ధి వంటి పరిస్థితులను సమర్థంగా నియంత్రించేందుకు ప్రభుత్వాలకు గొప్ప మార్గనిర్దేశం చేస్తున్నాయని పేర్కొంది.

