హోప్‌ను పక్కా ప్లాన్‌తో పడగొట్టాం: అర్జ్‌దీప్

కలం, స్పోర్ట్స్: “ముందుగా వేసుకున్న ప్రణాళికలు మైదానంలో పక్కాగా అమలు కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సంతోషం వ్యక్తం చేశారు. ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అనంతరం సోమవారం బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో అర్ష్‌దీప్ మాట్లాడారు. అద్భుత ఫామ్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను కేవలం 5 పరుగులకే కట్టడి చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని ఆయన చెప్పారు. కోచ్‌లు సిద్ధం చేసిన ప్రణాళికను సరిగ్గా అమలు చేయడం వల్ల ఫలితం దక్కిందని స్పష్టం చేశారు.

మ్యాచ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన అర్ష్‌దీప్, ఈ విజయం జట్టు బౌలర్లందరి ఉమ్మడి కృషి అని కొనియాడారు.ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ రనౌట్ కావడానికి తన తప్పుడు కాల్ కారణమని అర్ష్‌దీప్ అంగీకరిస్తూ, అతనికి క్షమాపణలు తెలియజేశారు. లోయర్ ఆర్డర్‌లో పరుగులు సాధించేందుకు బ్యాటింగ్‌పై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, యార్కర్లు, వైడ్ లైన్లు ఉపయోగిస్తూ అర్ష్‌దీప్ బౌలింగ్ విభాగాన్ని నడిపించిన తీరును వెస్టిండీస్ మాజీ దిగ్గజం ఇయాన్ బిషప్ ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>