కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మండలంలోని పందిళ్ళ వంతెన సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్ మండలం శ్రీరాములపల్లికి చెందిన భార్యభర్తలు దివ్య తేజ, గంగం శ్రీధర్ రెడ్డి, కుమారుడు నిహాన్ రెడ్డి, కూతురు శ్రీనిక కారులో హైదరాబాదు నుండి స్వగ్రామం శ్రీరాములపల్లికి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో పందిళ్ళ వంతెన వద్ద అతివేగంతో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో భార్య దివ్య తేజ, కుమారుడు నిహాన్ రెడ్డిలకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Read Also: మెర్సిడెజ్ రీ-ఎంట్రీ: ఫార్ములా 1 రేసుల్లో కుర్రాడి సంచలనం!
Follow Us On: Instagram

