రోడ్డు ప్రమాదాలతోనే అధిక మరణాలు: పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిజామాబాద్  (Nizamabad) జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజు శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన ఎస్సైలు, సీ.ఐ లు, ఏ.సీ.పీ లు నిజామాబాద్ జిల్లా అదనపు డి.సి.పి (అడ్మిన్) అందరూ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద ప్రజలతో డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు..

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం , మద్యం సేవించి వాహనం నడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేసారు.

కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని తెలియజేశారు. కాబట్టి రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని కృషి అనేది ప్రతి ఒక్కరీ నుండి మొదలవ్వాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో అట్టి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తారో , అతనికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుట కోసం సహార్విర్ పథకం కింద ఉండేటటువంటి 25 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే పాంప్లెంట్లు పోస్టర్లను విడుదల చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీ.ఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై శ్రీ రామ్, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి , రెంజల్ ఎస్సై చంద్రమోహన్ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది ప్రజలు ఆర్టీసీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>