ములకలపల్లిలో విషాదం.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

కలం, ఖమ్మం బ్యూరో : క్షణకాలం క్రితం వరకు పక్కనే నిలబడి మాట్లాడాడు.. ఇంటికి వెళ్దామని ద్విచక్ర వాహనం ఎక్కేలోపే మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

స్థానికుల కథనం ప్రకారం… సాయిబాబా అనే వ్యక్తి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మలుపు వద్ద వేచి చూస్తున్నాడు. అదే సమయంలో స్కూటీపై వస్తున్న ఓ పరిచయస్థుడిని చూసి మాట్లాడాడు. అనంతరం అతనితో కలిసి వెళ్లేందుకు స్కూటీ ఎక్కే ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా కాలు జారీ కింద పడిపోయాడు.​ సరిగ్గా అదే క్షణంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ (Tipper Lorry) సాయిబాబా పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ చక్రాల కింద నలిగిపోయిన సాయిబాబా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

కళ్లముందే జరిగిన ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృత్యువు ఏరూపంలో వస్తుందో తెలియదనడానికి అద్దం పట్టిన ఈ ప్రమాద దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>