కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం (Rishikesh Bus Accident) జరిగింది. గులార్ బజార్ వద్ద ఉన్న ఒక వంతెన పైనుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే బయాసి, ధల్వాలా పోస్టుల నుండి ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుండి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు సుమారు 20 మంది క్షతగాత్రులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కమాండెంట్ అర్పణ్ యదువంశీ ఆదేశాల మేరకు అదనపు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కూడా ఘటనా స్థలానికి పంపించారు.

